06-01-2026 12:03:28 AM
కొత్తపల్లి, జనవరి 5(విజయక్రాంతి): విద్యానగర్ 21వ డివిజన్ లో 20 లక్షలతో సిసి రోడ్డు,మురుగు కాల్వ నిర్మాణానికి, రాంచంద్రాపూర్ కాలనీ 11 వ డివిజన్ లో 25 లక్షలతో సిసి రోడ్లు,మురుగుకాల్వ నిర్మాణానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ఈ అంతర్గత రోడ్లు,మురుగు కాలువలు నిర్మిస్తున్నామని రాబోయే రోజుల్లో మిగిలిపోయిన అన్ని పనులను త్వరితగతిన పూర్తిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమాలలో బోనాల శ్రీనివాస్,వరాల నర్సింగం,చేవెళ్ల మల్లికార్జున్, ఊరడి లత, వెన్నం రజితా రెడ్డి మిర్యాల శ్రీధర్ రెడ్డి, గుడిపాటి రమణా రెడ్డి, తాళ్లపల్లి మహేష్ గౌడ్, భూపతి జగన్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, సుతారి శ్రీనివాస్, నాగరాజు, అనిత,స్వప్న, కవిత పాల్గొన్నారు.