06-01-2026 12:04:40 AM
ముకరంపుర, జనవరి 5 (విజయ క్రాంతి): టీఎన్జీవో జిల్లా, పట్టణ శాఖల ఆధ్వర్యంలో ముద్రించిన టీఎన్జీవోల క్యాలెండర్2026ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్లు, నాలుగో తరగతి ఉద్యోగులు సహా ఉద్యోగ వర్గాలన్నిటికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజాసేవలో ఉద్యోగులు మరింత నిబద్ధతతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవోల జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి సంఘము లక్ష్మణరావు, టిజీఓల అధ్యక్ష, కార్యదర్శులు మడిపల్లి కాళీ చరణ్, అరవింద్ రెడ్డి, కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, సర్దార్ హరేమేందర్ సింగ్, హరికృష్ణ, గూడ ప్రభాకర్ రెడ్డి, సందీప్ రవీందర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, గంగార రమేష్, పోలు కిషన్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.