17 April, 2026 | 2:37 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

జిల్లాలో విత్తనాలు ఎరువుల దుకాణాల తనిఖీలు

31-05-2025 06:19 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో నకిలీ విత్తనాలు ఎరువులలో భాగంగా శనివారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల(District SP Janaki Sharmila) ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాల్లో పోలీసులు రెవెన్యూ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. సందర్భంగా స్టాక్ రిజిస్టర్, డెలివరీ రిజిస్టర్, బిల్ బుక్, తదితర రికార్డ్స్ తనిఖీ చేసి షాప్ లో ఉన్నా సీడ్స్, ఫర్టిలైజర్ పరిశీలించారు. నకిలీ విత్తనాలు, కాలం చెల్లిన విత్తనాలు, కాలం చెల్లిన పురుగుమందులు, నకిలీ పురుగు మందులు అమ్మే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తరచుగా షాపులను తనిఖీ చేయడం జరుగుతుందని, రైతులను మోసం చేయాలని చూసే షాపు యజమానులపై కఠినంగా వ్యవహరిస్తామని, రైతులు కూడా అప్రమత్తంగా ఉండి వ్యవసాయ అధికారులు సూచించిన విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. ఏ షాపులో కొన్న తప్పకుండా బిల్ తీసుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ డా జి.జానకి షర్మిల ఐపీఎస్ మాట్లాడుతూ... నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ కేసులు పెట్టటం జరుగును అని తెలియజేశారు. 

గ్రామాలలో విడి విత్తనాలు, ఎక్కడైనా నకిలీ విత్తనాలు ఉన్నట్లు నకిలీ పురుగు మందులు కాలం చెల్లిన పురుగుమందులో విత్తనాలు ఎవరైనా అమ్ముతున్నట్లు సమాచారం వస్తే వెంటనే డయల్ 100 లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ సమాచారం అందించాలని సూచించారు లేదా నెంబర్ 8712659599 కు సమాచారం అందించాలని సూచించారు. నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు అని, కష్టానికి తగిన ప్రతిఫలం పొందాలంటే లైసెన్స్ ఉన్న దుకాణాల్లో మాత్రమే విత్తనాలు కొనాలని సూచించారు.