14-01-2026 12:14:32 AM
మునుగోడు సర్పంచ్ రమాదేవి
మునుగోడు, జనవరి 13 : మునుగోడు గ్రామ పంచాయతీ పరిధిలో పలు వార్డులలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో 90 వీధి దీపాలను ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ తెలిపారు. గ్రామంలో ప్రతి కాలనీలో వీధి దీపాల సమస్య లేకుండా చూస్తామని పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఉప సర్పంచ్ ఉప్పునూతల సుగుణమ్మ, వార్డు సభ్యులు నారగోని అనూష జగన్, సద్దల కళ్యాణి శ్రీశైలం, శ్రీరామోజు వెంకటేశ్వర్లు, ఉప్పునూతల శ్రీశైలం, వివిధ వార్డు సభ్యులు, గ్రామస్థులు ఉన్నారు.