14-01-2026 12:13:30 AM
2 బైకులు, 2 తులాల బంగారం స్వాధీనం
నల్గొండ క్రైం, జనవరి 13: ఇద్దరు దోపిడీ దొంగలను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు వారి నుండి రెండు బైకులు రెండు తులాల బంగారం చైన్ ను స్వాధీనం చేసుకున్నారు నేరస్తుల వివరాలను మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమే ష్ వెల్లడించారు సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలోని గోరంట్ల గ్రామానికి చెందిన బైక్ మెకానిక్ గా పనిచేసే గునిగంటి మహేష్ అలియాస్ నాగరాజు ఇతను స్నేహితుడైన హైదరాబాద్ చంపాపేట్ గాంధీ విగ్రహం సమీప నివాసానికి చెందిన ఆటో డ్రైవర్ గా పని చేసే పాథ్లవత్ వినయ్ లు గత ఏడాది నవంబర్ 28న కేతపల్లి మండలం ఇనుపాఁముల గ్రామానికి చెందిన ఉప్పుల వెంకట రమణిని కత్తి తో గాయపరిచి తన మెడలో ఉన్న బంగారు పూస్తేల తాడు, చెవి దిద్దులు దొంగతనం చేసుకొని పారిపోయినాడు.
కేతేపల్లి పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు ఇవ్వగా, దర్యాప్తు చేస్తున్నామని మరోసారి దొంగతనం చేసేందుకు నార్కట్పల్లికి వచ్చి తిరిగి బైక్ చోరీ చేసి వెళ్తున్న క్రమంలో పట్టుకున్నట్లు తెలిపారు మహేష్ పాత నేరస్తుడని తెలిపారు కేసు చేదించిన వారినిఏ ఎస్ పి రమేష్ అభినందించారు. ఈ సమావేశంలో డి.యస్.పి శివరాం రెడ్డి సీఐ, కొండల్ రెడ్డి, సీ సీ ఎస్ సీఐ చంద్ర శేకర్ రెడ్డి, జితేందర్ రెడ్డి , కేతేపల్లి ఎస్త్స్ర సతీష్ సిబ్బందిని సీసీఎస్ ఎస్.ఐ విజయ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ విష్ణు వర్ధన్ గిరి, వహిద్ పాషా, శ్రీనివాస్ రెడ్డి, ఫయాజ్, కానిస్టేబుల్ విజయ్ కుమార్‌లు ఉన్నారు.