calender_icon.png 14 January, 2026 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత

14-01-2026 12:15:28 AM

చౌటుప్పల్, జనవరి 13 (విజయక్రాంతి): మునుగోడు  శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  సహకారంతో వారి ఆదేశాల మేరకు చౌటుప్పల్ వివిధ గ్రామాలకు మరియు మున్సిపాలిటీ చెందిన లబ్ధిదారులకు ప్రభుత్వ అధికారులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కళ్యాణ లక్ష్మి 49 మరియు సీఎం రిలీఫ్ ఫండ్ 34 చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, ఎమ్మార్వో వీర బాయ్,మండల అధ్యక్షులు బోయ దేవేందర్, మున్సిపాలిటీ అధ్యక్షులు సుర్వి నర్సింహగౌడ్, రెవిన్యూ అధికారులు బాణాల రామ్ రెడ్డి, సుధాకర్‌రావు, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్లు, జిపిఓలు  మాజీ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు కార్యకర్తలు  పాల్గొన్నారు.