6 June, 2026 | 1:44 AM

లబ్ధిదారులకి ఇన్సూరెన్స్ చెక్కు అందజేత

06-06-2026 12:16 AM

కూసుమంచి, జూన్ 5 (విజయక్రాంతి): కూసుమంచి మండలంలోని పెరిక సింగారం గ్రామానికి చెందిన కుంచల గోవర్ధన్ గేద విద్యుత్ ప్రమాదానికి చనిపోవడం జరిగింది. విద్యుత్ శాఖ ద్వారా మంజూరైన ఇన్సూరెన్స్ 40 వేల రూపాయల చెక్కును మంత్రి క్యాంపు కార్యాలయ ఇంచార్జ్ భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారుడికి క్యాంపు కార్యాలయంలో అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడీఈ, కూసుమంచి మండలం మాజీ ఎంపీపీ జూకూరి గోపాల్ రావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కందునూరి ఏడుకొండలు, గ్రామ శాఖ అధ్యక్షులు కుర్రి వెంకటేశ్వర్లు పంచాయతీ వార్డు సభ్యులు ఈర్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.