12-11-2025 01:07:43 AM
యాచారం, నవంబర్ 11: ప్రధానమంత్రి జీవనజ్యోతి చెక్కును ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ మాన్య నాయక్ లబ్ధిదారులైన కే యాదమ్మకు అందజేశారు. యాచారం ఎస్బిఐలో యాచారం గ్రామానికి చెందిన కేశముని దశరథ ఖాతాదారులుగా కొనసాగుతూనే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం ద్వారా నెలకు రూపాయలు 436 చెల్లించేవారు.
అనారోగ్య కారణం చేత ఈ సంవత్సరం జనవరిలో దశరథ మృతి చెందారు. మృతి చెందిన దశరథకు నామినేగా యాదమ్మ ఉండడంతో ఆయన మరణానంతరం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆమెకు రూ. రెండు లక్షలు మంజూరయ్యాయి మంజూరైన చెక్కును బ్యాంకు మేనేజర్ మాన్య నాయక్ ఆమెకు అందజేశారు. కార్యక్రమంలో ఎఫ్‌ఓ ఈశ్వరరావు, క్యాష్ ఆఫీసర్ బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.