calender_icon.png 12 November, 2025 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికుల హక్కుల కోసం సీఐటీయూ నిరంతర పోరాటం

12-11-2025 01:08:15 AM

  1. సీఐటీయూ జిల్లా  నూతన అధ్యక్షునిగా రుద్రకుమార్, 

కార్యదర్శిగా చంద్రమోహన్ కోశాధికారిగా జి.కవిత ఎన్నిక 

రాజేంద్రనగర్, నవంబర్ 11, (విజయక్రాంతి): కార్మికుల హక్కుల కోసం సిఐటియు నిరంతరం పోరాడుతూనే ఉంటుందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్లు తెలిపారు.  గత రెండు రోజులుగా కాటేదాన్ లో జరుగుతున్న సిఐటియు రంగారెడ్డి జిల్లా 4వ సభలు మంగళవారం విజయవంతంగా ముగిశాయి. ఈ సభల ముగింపు కార్యక్రమానికి  ముఖ్య అతిథులుగా హాజరైన  తెలంగాణ రాష్ట్ర  కార్యదర్శి కూరపాటి రమేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం కార్మిక వర్గ చైతన్యంతో పనిచేయాలని కోరారు. 

దేశంలో ఉన్నటువంటి కార్మికుల ప్రజల సంపద మొత్తం బిజెపి ప్రభుత్వం బడా కార్పొరేట్ పెట్టుబడిదారీ సంస్థలకు ధారాధత్తం చేస్తుందని  వారు ఆరోపించారు.  రోడ్లు, బొగ్గు,రైల్వే,ఓడరేవులు ఎయిర్ ఫోర్స్ ప్రభుత్వ పరిశ్రమలు ఇలా అనేక పరిశ్రమలను ప్రైవేటు పరం చేస్తున్నాయని విమర్శించారు.  సిఐటియు నాయకులు కురుమయ్య,  జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ తదితర నాయకులు పాల్గొన్నారు.

సిఐటియు రంగారెడ్డి జిల్లా నూతన కమిటీని ఎన్నుకోన్నారు. అధ్యక్షునిగా రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన రుద్రకుమార్, కార్యదర్శిగా  చంద్రమోహన్, ఉపాధ్యక్షులుగా ఎస్ రామ్మోహన్ రావు, డి కిషన్. ఎన్. రాజు,డి జగదీష్, మల్లె పాక వీరయ్య , జే.పెంటయ్య సహాయక కార్యదర్శులుగా స్వప్న, అల్లి దేవేందర్,  ఎల్లయ్య, సిహెచ్ ఎల్లేష్.  మల్లేష్,  ఎల్లయ్య తో కమిటీని ఎన్నుకున్నారు.

అనంతరం నూతన అధ్యక్షులు రుద్ర కుమార్ మాట్లాడుతూ నాపై ఎంతో నమ్మకంతో జిల్లా అధ్యక్షునిగా నియమించినందుకు సిఐటియు జిల్లా  కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజులలో జిల్లాలో కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యల మీద రాజీలేని పోరాటం చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

రాజేంద్రనగర్ సర్కిల్ ఐదు డివిజన్లో సిఐటియు కన్వీనర్లు భాస్కర్, స్వామి, కాలే రాజు,వెంకటయ్య, చుక్క మోహన్ గండిపేట్ మండలం. శంషాబాద్ మండలం కార్మిక నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ రెండు రోజుల మహాసభల్లో పిఎన్‌ఎం కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.