29 May, 2026 | 1:54 AM

తప్పులు మాఫీ చేస్తారట!?

29-05-2026 01:17 AM
  1. మరోసారి తప్పు చేయమని లెటర్ రాసి ఇవ్వండి
  2. జిల్లావ్యాప్తంగా ఇదే తంతు ఉన్నట్లు చర్చలు
  3. ఒకరిద్దరి కోసం సభ్యులకు తీవ్ర అన్యాయం 
  4. విచారణ పేరుతో కాలయాపన చేస్తున్న అధికార యత్రాంగం 
  5. వారు చెప్పిందే ఫైనల్ అంట... ఇక అధికారులు ఎందుకు?
  6. విజయక్రాంతి మహిళా సమైక్యపై వస్తున్న వరుస కథనాలపై తీవ్ర చర్చ 

చిన్న చింత కుంట, మే 28: తప్పు చేసిన వీఓఎలకు మరోసారి తప్పు చేయమని రాసి ఇవ్వండి.. మీరు రాసిన లెటర్ ఇతరులకు చూపం. ఇప్పటివరకు ఏం చేశారనేది పక్కన పెడతాం. అదనంగా వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వండి... మహిళా సంఘాల్లో జరుగుతున్న అక్రమాలపై సంబంధిత అధికారులు పూర్తిగా నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుంది.

మా డబ్బులు అదనంగా వసూలు చేస్తున్నారు మహాప్రభు అంటూ మహిళా సంఘాల సభ్యుల సాక్షాత్తుగా అధికారులకు వెళ్లి ఫిర్యాదు పత్రాలను అందించిన వారికి న్యాయం చేసేందుకు మాత్రం అధికారులు అడుగులు ముందుకు వేయడం లేదు. పేపర్లలో వార్తలు వస్తుంటాయి పోతుంటాయి తప్పులు అన్నాక జరుగుతుంటాయి అనేలా మహిళా సంఘాల నిర్వహణ అధికారుల తీరు చూస్తే ఇట్టే అనిపిస్తుంది. 

ఎమ్మెల్యే సొంత మండలంలో వెలుగులోకి..

దేవరకద్ర ఎమ్మెల్యే సొంత మండలం చిన్నచింతకుంటలో వివో ఏలు చేతివటం ప్రదర్శిస్తున్నారని సాక్షాత్తు మహిళా సంఘాల సభ్యులే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై సమగ్ర విచారణ చేయవలసిన అధికార యంత్రాంగం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం వల్ల మహిళా సంఘాల సభ్యులు మరింత ఆసానానికి గురి అవుతున్నారు.

ఫిర్యాదు చేసిన తర్వాత టార్గెట్ చేస్తారని భయం కూడా వారి లోపల మెదులుతుంది. ఇప్పటికైనా అధికార యంత్రం సమగ్ర విచారణ చేసి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి తప్పిదాలు జరుగుతున్నాయో సరిచేసి మహిళా సంఘాల సభ్యులకు మేలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు. 

ఒక్కసారి మాఫీ చేస్తారంట..

పదిమందికి మంచి జరిగేందుకు ఒకరికి అన్యాయం జరిగిన పర్వాలేదు అని అంటారు... ఒక్కరికి న్యాయం చేసేందుకు 100 మందికి అన్యాయం జరిగిన పర్వాలేదు అంటున్నారు సిసి కుంట మండల మహిళా సమైక్య. ఇప్పటివరకు జరిగింది పక్కన పెడదాం ఒక లెటర్ రాసి ఇవ్వండి అంతా మేము చూసుకుంటాం అంటూ ఏపిఎం నాగమణి వీఓఏ లకు సూచించినట్లు తెలిసింది. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో విచారణ చేసి సభ్యులకు న్యాయం చేయాలని మహిళా సంఘాల సభ్యులు కోరుతున్నారు. 

ఉన్నత అధికారుల విచారణ షురూ..

మహిళా సంఘాల సభ్యుల నుంచి చేతివాటం ప్రదర్శిస్తున్న వివోఏ లపై చర్యలు తీసుకున్నందుకు ఉన్నత అధికారులు మరో అడుగు ముందుకేసినట్లు తెలుస్తుంది. మండల స్థాయిలో అధికారులు ఏ సమస్య వచ్చినా అక్కడే మరుగున పడేలా చేస్తూ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకురావడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మహిళా సంఘాల సభ్యులు చెబుతున్నా మాట. ఈ తరుణంలో సంబంధిత శాఖ ఉన్నత అధికారులు మరో అడుగు ముందుకేసి తామే విచారణలోకి వస్తే తప్పులు ఎక్కడ జరుగుతున్నాయని వెలుగులోకి వచ్చి మహిళా సంఘాల సభ్యులకు మేలు జరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారంట.

లెటర్ రాపించుకుంటాం మీకు చూపించం

 ఇప్పటివరకు ఏమైనా తప్పిదాలు జరిగితే వాటిని రికవరీ చేయిస్తాం. వారి నుంచి మరోసారి తప్పు జరగకుండా లెటర్ రాయించుకుంటాం. ఆ లెటర్ లో ఏమి రాశారు అనేది ఎవరికి చూపించం. ఇంకా వివోఏ ల నుంచి లెటర్ తీసుకోలేదు. కొన్ని తప్పులు జరిగినట్లు మాకు సమాచారం అందింది. 

- నాగమణి, ఏపీఎం