26 June, 2026 | 6:46 PM

Breaking News

ఐకేపీ వీఓఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి   •   టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా ఆరెపల్లి రాహుల్   •   నిర్మల్ పోలీస్... మీ పోలీస్...   •   బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం   •   డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •  

వేసవిలో క్లాసులు నడుపుతున్న ఇంటర్ కాలేజీలను మూసెయ్యాలి

05-04-2025 12:00 AM

ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అశోక్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 4(విజయక్రాంతి) : ఇంటర్మీడియట్ బోర్డు  నిబంధనలకు విరుద్ధంగా వేసవిలో క్లాసులు నడుపుతున్న ఇంటర్ కాలేజీలను మూసెయ్యాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అశోక్‌రెడ్డి డిమాండ్ చేశారు. జూన్ 1వ తేదీ వరకు ఇంటర్ బోర్డు సెలవులు ప్రకటించినప్పటికీ నగరంలోని కార్పొరేట్ కాలేజీలు సెలవులు ఇవ్వకుండా విద్యార్థులను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయ ని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డబ్బులకు లొంగి ఇంటర్మీడి యెట్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరరోపించారు. వేసవిలో క్లాసులను నిర్వహిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని, లేదంటే ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు.