calender_icon.png 24 February, 2026 | 7:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు

24-02-2026 01:38:08 AM

5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి

పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి.. సీసీ కెమెరాలతో నిఘా

అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలి

మానసిక ఒత్తిడి నివారణకు ‘టెలి-మానస్’ సేవలు

ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య

హైదరాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 25 నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏ ర్పాట్లను ఇంటర్ బోర్డు అధికారులు పూర్తి చేశారు. సోమవారం నాంపల్లిలోని బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బోర్డు కార్యాదర్శి కృష్ణ ఆదిత్య వివరాలు వెల్లడించారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు థియరీ పరీక్షలు జరగ నున్నాయని పేర్కొన్నారు. ఉదయం 9 నుం చి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ పరీక్షలకు 1,495 సెంటర్లలో మొత్తం 9,97,075 మం ది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. అందులో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4,89, 126 మంది, సెకండియర్ విద్యార్థులు 5,07,949 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణ కోసం 28,500 మంది ఇన్విజిలేటర్లు, 75 ఫ్లయింగ్ స్వాడ్లు, 200 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి అరగంట ముందే చేరుకోవాలని, 15 నిమిషాల ముం దే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా లోపలికి పంపిస్తామన్నారు. 

హైకోర్టు ఉత్తర్వుల మేరకు అందరికీ హాల్‌టికెట్లను జారీ చేశామని, విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి లేదా కళాశాలల నుంచి హాల్ టికెట్లు పొందవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు హాల్‌టికెట్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఇక సెల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను పరీక్షా హాల్లోకి అనుమ తించరని, మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసు లు నమోదు చేయనున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం పరీక్షా కేంద్రాల్లో సుమారు 7,500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామ ని, రాబోయే రోజుల్లో 30 వేల పరీక్షా రూ ముల్లోనూ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థుల కోసం ప్రతి పరీక్షా కేంద్రంలో తాగునీరు, ఫర్నిచర్, గోడ గడియారాలు వైద్య సహాయం అందుబాటులో ఉండేలా మార్గదర్శకాలను ఇప్ప టికే జారీ చేశామన్నారు. సాంకేతిక సమస్య లు ఏమైనా ఉంటే వెంటనే బోర్డుకు ఫోన్ చే యాలని సిబ్బందికి సూచించారు.

పకడ్బందీగా పరీక్షలను నిర్వహించేలా అన్ని ఏర్పా ట్లూ పూర్తి చేశామని, ఇంటర్ బోర్డులోని కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తామని చెప్పారు. ఈనెల 26 నుంచి పేపర్ వ్యాల్యుయేషన్ క్యాంపులను కూడా ప్రారంభిస్తా మని ఆయన తెలిపారు. పరీక్షల సమయం లో విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనకు గురైతే సైకాలజిస్టుల సలహాల కోసం ఇంటర్ బోర్డు టెలీమానస్ సేవలను అందిస్తోందని తెలిపారు. ఉచిత సేవల కోసం 14416తోపాటు 8069391416 నెంబర్లను సంప్రదించాలని బోర్డు సూచించింది. ఈ సేవలు 24 గంట లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.