13 April, 2026 | 12:51 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

అడ్డంకులను అధిగమిస్తాం

24-02-2026 01:33 AM
  1. గౌరెల్లి పర్యావరణ అనుమతులు త్వరలోనే.. 
  2. న్యాయపరమైన చిక్కుల పరిష్కారం ప్రక్రియ మొదలుపెట్టాం 
  3. జూన్ 2కు ముందే భూసేకరణకు నిధులు : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యం క్రమంలో నిర్మించే ప్రాజెక్టుల్లో గౌరెల్లి ప్రాజెక్టు ముఖ్యమైనదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. రూ.1.06 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టు పర్యావరణ అనుమతులుతో పాటు న్యాయపరమైన చిక్కులు ఏర్పడడంతో పనులు మందగించాయన్నారు.

అయితే అటువంటి అవంతారాలను అధిగమించి త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలంలోని గౌరెల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు పురోగతిపై సోమవారం సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలసి ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

రాష్ట్ర నీటిపారుదల శాఖా సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆర్‌ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు, ఈఎన్సీ జనరల్ రమేష్ బాబుతో పాటు కరీంనగర్, జనగామ, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ...

వరద కాలువ ద్వారా వచ్చే నీటితో సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం గౌరెల్లిలో 1.41 టీఎంసీల నీటితో ఈ రిజర్వాయర్ నిర్మాణం ప్రతిపాదించగా అంచనాలు సవరించి 8.23 టీఎంసీల సామర్థ్యానికి పెంచి అదనపు ఆయకట్టు సేద్యంలోకి తేవాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి సవరించిన ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు పెట్టమన్నారు. అయితే అదే సమయంలో భూసేకరణ విషయంలో రైతులకు అందించే చెల్లింపులు న్యాయబద్ధంగా ఉండడంతో పాటు సకాలంలో నిధుల మంజూరుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని వెల్లడించారు.

గౌరెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణకు అవసరమైన నిధులను జూన్ 2 ముందే విడుదల చేస్తామని, అందుకు సంబంధించిన ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని కరీంనగర్, జనగామ, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. న్యాయపరమైన అంశాలను ఎదుర్కొంటున్న గౌరెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన కేసు మరో రెందు రోజుల్లో విచారణకు రానున్న సందర్భంలో చిక్కులను అధిగమించేందుకు అవసరమైన వ్యూ హంతో సిద్ధంగా ఉండాలని సమీక్షలో పాల్గొన్న అడ్వకేట్ జనరల్‌ను ఆదేశించారు.

అనేక అవాంతరాలతో అర్ధాంతరంగా నిలిచిపోయిన గౌరెల్లి ప్రాజెక్టును పూర్తిచేసేందుకు అన్నివైపులా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇకపై నిధుల కేటాయింపులలో కూడా ఎటువంటి అలసత్వానికి అవకాశం లేకుండా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొంది స్తున్నామన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... గౌరెల్లి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు నిరంతరం ఒత్తిడి పెంచుతున్నామని, అందుకు సంబంధించిన భూసేకరణను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

సీఎం రేవంత్‌రెడ్డి నిర్దేశించిన రీతిలో దేవాదుల, గౌరెల్లితో సహా నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణను పూర్తి చేయాల న్నారు. పట్టణీకరణ వేగవంతంగా పెరుగుతున్న నేపథ్యంలో భూముల ధరలు పెరగడంతో రైతులు పెద్ద మొత్తంలో నష్టపరిహారం కోరుకుంటున్నారని, అందుకు సంబంధించిన విధాన నిర్ణయాలు న్యాయపరంగా తీసుకోవాలని సూచించారు. గౌరెల్లి ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్‌కు సూచించారు.