11 April, 2026 | 2:12 AM

సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు

11-04-2026 12:50 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): శివారు ప్రాంతాల్లోని సెల్ టవర్ల సంబంధించిన బ్యాటరీల చోరీలకు పాల్పడుతున్న ముఠాలోని ఐదుగురిని హనుమ కొండ జిల్లా హసన్పర్తి పోలీసులు అరెస్టు చేయగా, మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో వున్నారు. పట్టుబడిన నిందితుల నుండి పోలీసులు సుమారు 1 లక్ష 98వేల రూపాయల విలువ గల 144 సెల్ టవర్ బ్యాటరీలు, 2లక్షల 60వేల రూపాయల నగదు, రెండు ట్రాలీలు, రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన కొంపల్లి గణేష్, బొంగరాల సుధాకర్, తన్నీరు శివాజీ, బీమనబోయిన నరసింహ, గడగోజు సురేష్ ఉన్నారు.

పోలీసులకు పట్టుబడిన నిందితుల్లో ప్రధాన నిందితుడైన గణేష్ (డ్రైవర్) మిగితా మిగితా ఇద్దరు నిందితులైన  సుధాకర్, శివాజీలకు జనరేటర్ మరమ్మత్తులు, సెల్ టవర్ పనితీరు పరిజ్ఞానం కలిగి వుండటంతో ముఠాగా ఏర్పడి, సులభంగా డబ్బు సంపాదించాలనే అలోచనతో సెల్ టవర్లకు వినియోగించే బ్యాటరీల్లోని కొన్నింటి తప్పించడం ద్వారా సెల్ టవర్ పనతీరులో ఎలాంటి సమస్యలు రావని గుర్తించిన నిందితులు సెల్ టవర్ బ్యాటరీలను చోరీలు చేస్తున్నారన్నారు.

ముగ్గురు నిందితులు సెల్ టవర్లోని బ్యాటరీలను చోరీ చేసి మహరాష్ట్రలోని గచ్చిరోలి ప్రాంతంలో విక్రయించి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవారని, రాత్రి సమయాల్లో చెరువుల్లో చేపలను చోరీలకు పాల్పడే మిగతా ముఠా సభ్యులు సైతం కలవడంతో, ఈ ముఠా సభ్యులు చేపలు చోరీలకు పాల్పడే సమయంలోనే బ్యాటరీలు చోరీ చేసేందుకు అనుకూలంగా వున్న సెల్ టవర్లను గుర్తించిన సెల్ టవర్లలోని బ్యాటరీలను చోరీలకు పాల్పడేవారన్నారు.

అలాగే చెరువుల్లో చోరీ చేసిన చేపలను నల్గొండలో తక్కువ ధర విక్రయించేవారని, ఈ తరహలో నిందితులు వరంగల్ కమిషనరేట్, యాదాద్రి, నల్గొండ, సూర్యపేట జిల్లాల్లో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 13 సెల్ టవర్ బ్యాటరీ చోరీలకు పాల్పడ్డారన్నారు.

మార్చి 3న హసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంత సాగర్ ప్రాంతంలోని సెల్ టవర్ నుండి 48 బ్యాటరీలకు చోరీకు గురికావడంతో ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హసన్పర్తి పోలీసులు సెంట్రల్ జోన్ డిసిపి దార కవిత అధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాపు చేపట్టారు. పోలీసులకు అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకోని ముఠా సభ్యులను గుర్తించిన పోలీసులు నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. పక్కా సమచారంతో శుక్రవారం తెల్లవారుజామున నిందితులు చోరీ సొత్తును అమ్మేందుకు హసన్పర్తి మండలం, దేవన్నపేట గ్రామ శివారు ప్రాంతంలోని అవుటర్ రింగ్ రోడ్డు టోల్ గేట్ వద్ద వేచి వున్న ముఠాలోని ఐదుగురు సభ్యులను హసన్ పర్తి పోలీసులు అరెస్టు చేసారు.

నిందితులు ఇచ్చిన సమచారంతో పోలీసులు చోరీ సోత్తు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకొవడంలో ప్రతిభ కబరిచిన సెంట్రల్ జోన్ డిసిపి ధార కవిత, కాజీపేట ఏసిపి ప్రశాంత్ రెడ్డి, హసన్పర్తి ఇన్స్సె్పక్టర్ చేరాలు,యస్ ఐ లు దేవేందర్, సుజిత్ రెడ్డి, కానిస్టేబుళ్ళు క్రాంతి కుమార్, బావు సింగ్, వెంకట స్వామి, భరత్ తో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు.