1 August, 2026 | 3:48 AM

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

01-08-2026 02:06 AM

జహీరాబాద్, జూలై 31 : వైన్స్ షాపుల్లో, ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు చిరాగ్ పల్లి ఎస్ ఐ రాజశేఖర్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం మొగుడంపల్లిలోని రేణుక ఎల్లమ్మ వైన్ షాప్, ఇండ్లలో జరిగిన దొంగతనం కేసుకు సంబంధించిన నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు.

జిల్లా ఎస్పీ పంకజ్ పరితోష్ ఉత్తర్వులు, జహీరాబాద్ డీఎస్పీ సైదానాయక్ సూచనలతో జహీరాబాద్ సిఐ శివలింగం ఆధ్వర్యంలో చిరాకుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దొంగతనాలకు పాల్పడిన వారిని సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా  బృందాలుగా దర్యాప్తును చేపట్టామన్నారు. తన బృందం పూణే నగరానికి వెళ్లి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు.

అరెస్ట్ చేసిన వారిలో రాహుల్ నందు రాథోడ్, జోక్ రాజ్ కురుదర్సింగ్ బిరావత్ ను అరెస్ట్ చేశామన్నారు. వర్ధమాన్, దక్ష,, శుక్రాచారి పరారీలో ఉన్నారని తెలిపారు.  మొగుడంపల్లి వైన్ షాప్ తో పాటు పలు ఇండ్లలో దొంగతనం చేయడమే కాకుండా అల్గోల్, జహీరాబాద్, ఝరాసంగం పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు దొంగతనాలలో వీరి ప్రమేయం ఉందని దర్యాప్తులో వెల్లడైందన్నారు.

వీరిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వారిని రిమాండ్కు పంపించిందన్నారు. ఈ కేసును ఫలితాలు ఛేదించి నిందితులను అరెస్టు చేయడంలో విశేష ప్రతిభ కనబరిచిన వారిని ఈ కేసును ఛేదించిన ఎస్.ఐ రాజశేఖర్, జహీరాబాద్ రూరల్ ఎస్త్స్ర రాజేందర్ రెడ్డి, హెడ్  కానిస్టేబుల్ హోమ్దేవ్ రాకేష్, హరినేత్ర, ఆనంద్లను ప్రశంసించారు.