calender_icon.png 5 December, 2024 | 12:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉరి వేసుకొని విద్యార్థి ఆత్మహత్య

03-11-2024 07:40:29 PM

మేడ్చల్,(విజయక్రాంతి): ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పట్టణంలోని కేఎల్ఆర్ కాలనీకి చెందిన కోట్ల సూర్యనారాయణ కుమారుడు అవినాష్(16) కొంపల్లిలో హాస్టల్ లో ఉంటూ ఆంటోనీ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. దీపావళి పండుగకు అవినాష్ ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి తిరిగి వచ్చిన మృతుడి కుటుంబ సభ్యులు అవినాష్ ను చూసి బోరుమని ఏడిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. అవినాష్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని చెప్పారు. తండ్రి సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.