calender_icon.png 19 August, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ డివిజనల్ కార్యాలయంలో వినియోగదారుల సదస్సు

03-11-2024 07:30:36 PM

హుజూర్ నగర్,(విజయక్రాంతి): హుజూర్నగర్ విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయంలో వినియోగదారుల సదస్సును ఆదివారం జరిగింది. దీనిలో భాగంగా కొంతమంది వినియోగదారులు ఇంటి ముందు ఉన్న ఎల్టీ లైన్ మార్చటానికి, కొత్త ఎల్టీ లైన్,  బిల్లింగ్ ఇష్యు, ఐరన్ పోల్ తిప్పు పట్టిందని మార్చటం, ఎర్త్ పైపులు తుప్పు పట్టిందని మార్చటం కొరకు ఇతర సమస్యలను డీఈకి విన్నవించడం జరిగింది. ఆ యొక్క సమస్యలను క్షేత్ర స్థాయిలో విచారించి పరిష్కరించడం జరుగుతుందని ఎన్.వెంకట కిష్టయ్య డీఈ  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ డీఈ వెంకట కృష్ణయ్య, హుజూర్నగర్ ఏడీ బి.సక్రు నాయక్, కోదాడ ఏడీఇ వెంకన్న, కోదాడ ఈఆర్ఓ హుజూర్నగర్ ఈఆర్వో విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.