calender_icon.png 7 June, 2025 | 6:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ విద్యార్థిని ఫలితాలు మిస్!

25-04-2025 02:14:37 AM

ఇంగ్లీష్ పేపర్‌ను మూల్యాంకనం చేయని వైనం

హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాల్లో ఓ విద్యార్థిని ఫలితాల్లో పొరపాట్లు దొర్లాయి. హియామయత్ నగర్‌లోని ఓ కార్పొరేట్ కాలేజీలో చదువుతున్న సీహెచ్ దిశ, వెబ్‌సైట్‌లో సెకండియర్ ఫలితాలు చూసుకుంటే ‘నో డిటైల్స్ ఫౌండ్’ అని ‘ఇన్ వ్యాలిడ్ హాల్‌టికెట్ నెంబర్’ అని వచ్చినట్టు సమాచారం.

అయితే ఈ విషయాన్ని ఆ విద్యార్థిని తండ్రి నాంపల్లిల్లోని ఇం టర్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా దిశ ఇంగ్లీష్ సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయలేదని, అది పెండింగ్‌లో ఉన్నట్టుగా గుర్తించినట్టు తెలిసింది. కొన్ని సాంకేతిక కారణాలతో ఈసారి ఇంటర్ ఫస్టియర్‌లో నలుగురు, సెకండియర్‌లో ఆరుగురు విద్యార్థుల ఫలితాలను బోర్డు నిలిపి వేసినట్టు సమాచారం.