ఉగ్రఘటనపై లాయర్ల నిరసన
మహబూబాబాద్, ఏప్రిల్ 24 (విజయ క్రాంతి): కాశ్మీర్ లోని పెహల్గాం లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి జరిపి ప్రాణాలను బలిగొన్న ఘటనను నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో లాయర్లు బుధవారం విధులు బహిష్కరించి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. బార్ కౌన్సిల్ అసోసియేషన్ హాలులో కార్యదర్శి జంగం సిద్ధార్థ అధ్యక్షతన జరిగిన సమావేశంలో న్యాయవాదులు గా మృతులకు సంతాపం వ్యక్తం చేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రేమ్ చందర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఎన్వి చలపతిరావు, తుంపిల్లా శ్రీనివాస్, ఎస్ డి రహీం పటేల్, మామిడాల సత్యనారాయణ, కొండపల్లి కేశవరావు, జే. వెంకటేశ్వర్లు, చిలక మారి వెంకటేశ్వర్లు, రవికుమార్, గంధసిరి ఉప్పలయ్య, షేక్ పాషా, దర్శనం రామకృష్ణ, మౌనిక తదితరులు పాల్గొన్నారు.






