calender_icon.png 11 May, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరీక్షల్లో తప్పడంతో ఇంటర్ విద్యార్థుల బలవన్మరణాలు

24-04-2025 01:52:09 AM

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): మంగళవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితా ల్లో తప్పడంతో రాష్ట్రవ్యాప్తంగా పలువురు విద్యార్థులు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరుకు చెందిన పూజ, కామారెడ్డిలోని ఆర్యభట్ట జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీ చదువుతోంది. ఫలితాల్లో తప్పడంతో బుధవారం ఉదయం తెల్లవారుజామున నిప్పంటించుకొని మృతిచెందింది.

లక్షెట్టిపేట్ పట్టణంలోని గోదావరిరోడ్‌లో నివాసముంటున్న అశ్విత (17) స్థానికంగా ఉన్న వాగేశ్వరి జూనియర్ కళాశాల లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోం ది. ఇంగ్లీష్ ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ కావడంతో మనస్థాపం చెంది ఉరేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపురం గ్రామానికి చెంది న ఓ విద్యార్థిని ఫస్టియర్‌లో ఫెయిల్ కావడం తో ఉరేసుంది.

హైదరాబాద్ మోతీనగర్ సమీపంలోని అవంతినగర్‌కు చెందిన ఫస్టియర్ విద్యార్థి పరీక్షలో ఫెయిల్ కావడంతో మనస్థాపానికి గురై సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొంది. నాగోలు తట్టిఅన్నారం వైఎస్‌ఆర్ కాలనీకి చెందిన విద్యార్థిని ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం పరీక్షలు రాసింది. ఒక సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున ్నట్టు సమాచారం.

బంజారాహిల్స్ రోడ్డు నంబర్‌2లోని ఇందిరా నగర్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న నిష్ఠ అనే విద్యార్థిని కెమిస్ట్రీలో ఫెయిల్ కావడంతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లికి చెందిన ఓ విద్యార్థిని సెకండియర్ ఫలితాల్లో తనకు అనుకున్న స్థాయిలో మార్కులు రాలేదని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. దీంతో బాధిత కుటుంబాలు విషాదంలో మునిగాయి.