5 July, 2026 | 2:24 AM

జీఎస్‌టీ 2.0పై ఇంటర్ కాలేజియేట్ సెమినార్

05-07-2026 12:14 AM

ఐఐఏ ఆధ్వర్యంలో ఐఐఎంసీ కళాశాలలో ఘనంగా నిర్వహణ

ఖైరతాబాద్, జూలై 4(విజయక్రాంతి): ఆర్థిక వ్యవస్థలో కొత్త మార్పులు, పన్ను సం స్కరణల ప్రభావంపై అవగాహన కల్పించేందుకు ఇండియన్ అకౌంటింగ్ అసోసియేష న్, హైదరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అం డ్ కామర్స్ - (ఐఐఎంసీ) సహకారంతో నిర్వహించిన జీఎస్‌టీ 2.0 -కొత్త పన్ను విధానం, ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం అనే అంశం పై ఇంటర్ -కాలేజియేట్ సెమినార్ ఘనంగా జరిగింది.

ఐఐఎంసీ క్యాంపస్‌లోని ఆడిటోరియంలో జరిగిన ఈ సెమినార్‌కు ముఖ్య అ తిథిగా ఐఏఏ వైస్-చైర్మన్ సీఎంఏ డాక్టర్ కేసీహెచ్‌ఏవీఎస్‌ఎన్ మూర్తి విచ్చేసి ఇలాంటి సె మినార్లు అధ్యాపకులకు, విద్యార్థులకు వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించడంలో సహాయపడతాయని, ఐఏఏ భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తుందన్నారు. గౌరవ అతిథిగా విచ్చేసిన ఉ స్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, ఐఏ ఏ హైదరాబాద్ బ్రాంచ్ సెక్రటరీ ప్రొఫెసర్ జీ నరేష్‌రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కొన్ని కళాశాలల్లో నిర్వహించి జీఎస్‌టీ అంశాలపై అవగాహన పెంపొందించాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి ఐఐఎంసీ కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ వంగపల్లి విశ్వనాథం అధ్యక్షత వహించారు. ప్ర ముఖ చార్టర్డ్ అకౌంటెంట్ బాపు వెంకటేశం మరువాడ రిసోర్స్‌పర్సన్‌గా మాట్లాడుతూ జీఎస్‌టీ వల్ల చిన్న, మధ్యతరహా వ్యాపారాలకు కలిగే ప్రయోజనాలు, సవాళ్లు, భవిష్యత్ అవకాశాల గురించి ఉదాహరణలతో వివరించారు. మరో ముఖ్య ప్రసంగీకులు ఉస్మా నియా విశ్వవిద్యాలయం, యూసీసీ అండ్ బీఎం ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఇంద్రకంటి శేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు కేవలం పుస్తక పరిజ్ఞానంతో ఆగిపోకుండా, ఆర్థిక విధానాలపై అవగాహన పెంచుకోవాలని సూచించా రు. అనంతరం ప్రశ్నోత్తరాల సెషన్‌తో కార్యక్రమం సజీవంగా సాగింది.

జీఎస్‌టీపై అ ధ్యాపకులు విద్యార్థుల్లో స్పష్టత పెంచిన ఈ సెమినార్ అందరి ప్రశంసలు అందుకుంది. కార్యక్రమ నిర్వహణకు సహకరించిన ఐఐఎంసీ కళాశాల ప్రిన్సిపాల్ కూర రఘువీర్‌కి, పాల్గొన్న వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులకు ఐఐఏ ప్రతినిధులు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమం చివరన ఐఐఎంసీ చైర్మన్ ప్రొఫెసర్ వీ విశ్వనాధం, డీన్స్ డాక్టర్ తిరుమల రావు, డాక్టర్ జీ.   సంతోషి అతిథులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, వివి ధ కళాశాలల నుంచి వచ్చిన అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.