5 July, 2026 | 1:45 AM

స్టార్టప్‌లపై అవగాహన సదస్సు

05-07-2026 12:12 AM

సిద్ధార్థ ఇనిస్టిట్యూట్‌లో ఏర్పాటు

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలోని ఇనిస్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (ఐఐసీ) ఆధ్వర్యంలో ‘స్టార్టప్‌ల కోసం ప్రొటెక్టింగ్ ఐపీఆర్ అండ్ ఐపీ మేనేజ్‌మెంట్’ అం శంపై వర్క్‌షాప్‌ను సెమినార్ హాల్‌లో నిర్వహించారు.

ముఖ్య వక్త డా భరణి సేతు పాం డియన్ ఎస్ మేధో సంపత్తి హక్కులు, పేటెం ట్లు, ట్రేడ్‌మార్కులు, కాపీరైట్లు, ట్రేడ్ సీక్రెట్స్ ప్రాముఖ్యత, స్టార్టప్లు తమ ఆవిష్కరణలను ఎలా రక్షించుకోవాలి, మేధో సంపత్తిని వ్యా పార అభివృద్ధికి ఎలా వినియోగించుకోవా లి అనే అంశాలపై విద్యార్థులకు సమగ్రంగా వివరించారు. డా. కందే శ్రీనివాస్, ఐఐసీ కో ఆర్డినేటర్ సమన్వయం చేశారు. డైరెక్టర్ జి. భగత్, సెక్రటరీ డా. డి. ప్రదీప్ కుమార్, ప్రిన్సిపాల్ డా. పి. శేఖర్ బాబు మార్గదర్శకత్వంలో విజయవంతంగా నిర్వహించారు.