19-01-2026 09:19:23 PM
భైంసా,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో అరులైన మహిళా సంఘాలకు మెప్మా ద్వారా వడ్డీ లేని రుణాలు ఇందిరమ్మల చీరల పంపిణీ అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారని తెలిపారు. ఇప్పటికే పట్టణాల్లో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందించామని త్వరలో ఇందిరమ్మ చీరల పంపిణీ చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సాంకేత్ కుమార్, అధికారులు ఉన్నారు.