13-02-2026 12:00:00 AM
బంజారాహిల్స్,ఫిబ్రవరి 12(విజయక్రాంతి): బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, పరిశోధనా సంస్థ వేదికగా భారతీయ ఉపశమన చికిత్స సంఘం 33వ వార్షిక అంతర్జాతీయ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్పర్ష్ స్వచ్ఛంద సంస్థ, బసవతారకం ఆసుపత్రి సంయుక్తంగా నిర్వహిస్తున్న బృహత్తర సదస్సులో సందర్భంగా ఆసుపత్రి ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ కె. కృష్ణయ్య మాట్లాడుతూ.. ఉపశమన చికిత్స అనేది కేవలం వైద్యం మాత్రమే కాదని, అది కరుణతో కూడిన ఒక జీవన దర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ ప్రతినిధులు డాక్టర్ ఫ్రాంక్ ఫెర్రిస్, ఆసుపత్రి వైద్య సంచాలకులు డాక్టర్ టి. సుబ్రహ్మణ్యేశ్వర రావు, దేశం నలుమూలల నుండి వచ్చిన వైద్యులు, పరిశోధకులు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.