13-02-2026 12:00:00 AM
- గ్రామ సర్పంచ్ రజిత పరశురాం
జగదేవపూర్, ఫిబ్రవరి 12: ఆదర్శ గ్రామమే లక్ష్యంగా, ప్రజా సమస్యల పరిష్కరమే ద్యేయంగా పనిచేస్తానని తిగుల్ సర్పంచ్ కుడుదుల రజిత పరశురాం తెలిపారు. గురువారం జగదేవపూర్ మండలంలోని తిగుల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు వార్డుల్లో నెలకొన్న వివిధ సమస్యలను గ్రా మస్తులు సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి సమస్యను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందు కు చర్యలు తీసుకుంటామని సర్పంచ్ హామీ ఇచ్చారు.
గ్రామ అభివృద్ధికి అందరి సహకారం అవసరమని, విడతల వారీగా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టి తిగుల్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని ఆమె పేర్కొన్నారు. గ్రామంలో రోడ్డు ప్రమాదాల నివారణ కు స్పీడ్ బ్రేకర్లు వేస్తామని తెలిపారు. సమావేశంలో ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచులు సుధాకర్ రెడ్డి, గ్రామకార్యదర్శి నరేందర్, వార్డుసభ్యులు,నాయకులు దయానంద రెడ్డి, భూమయ్య, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, వివిధ పార్టీల నాయకులు గ్రామప్రజలు పాల్గొన్నారు.