07-12-2025 01:14:59 AM
హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని ఇబ్రహీంపట్నం భవిత కేం ద్రంలో మండల లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా జిల్లా అదనపు న్యాయమూర్తి జి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. దివ్యాంగ పిల్లలకు సంబంధించి 2016 చట్టం ప్రకారం లీగల్ సర్వీస్ అథారిటీ కూడా సపోర్ట్ చేస్తుందని తెలిపారు.
కోర్టులో వారికి కూర్చోవడానికి ప్రత్యేక వసతి, వీల్ సైకిల్, లిఫ్టు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రభుత్వ అందిస్తున్నటువంటి దివ్యాంగులకు సంబంధించిన పథకాలను వారి తల్లిదండ్రు లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండల అభివృద్ధి అధికారి వెంకటమ్మ, ఇబ్రహీంపట్నం బార్ ఆసోసియేషన్ అధ్యక్షుడు ము ద్దం వెంకటేశం, సంకల్ప ఎన్జీవో వ్యవస్థాపకురాలు రోజుని, జిల్లా కమ్యూనిటీ మొబి లైజర్ ఆఫీసర్ బత్తిని వెంకటేష్, మండల పిఆర్టియు అధ్యక్షులు డాక్టర్ వర్గాల పరమేష, ప్రత్యేక ఉపాధ్యాయులు ఐఈఆర్‌పీ రమేష్, దీప్తి ఎంఆర్‌సి సిబ్బంది శేషు, సం పత్, విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల విద్యా ర్థుల కు వారి తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించి, బహుమ తులు అందజేశారు.