బియ్యం ఎగుమతులకు కేంద్రంగా మారాలి
- ఎగుమతి ఆధారిత రైస్ మిల్లులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
- ఆధునిక సౌకర్యాలతో ధాన్యం నిల్వ
- గోదాములు, స్టీల్ సైలోల నిర్మాణానికి కృషి
- పౌర సరఫరాల శాఖ -మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ రైస్ అండ్ గ్రెయిన్స్ టెక్ ఎక్స్‌పో
హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): తెలంగాణను దేశంలోనే బియ్యం ఎగుమతులు, ఆధునిక సాంకేతికతలు, విలువ ఆధారిత ఉత్పత్తుల రంగంలో గుర్తింపు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్ రైస్ అండ్ గ్రెయిన్స్ టెక్ ఎక్స్‌పో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
బియ్యం ఎగుమతులను పెంచేందుకు తెలంగాణలో కొత్తగా ఏర్పాటు అయ్యే ఎగుమతి ఆధారిత రైస్ మిల్లులకు, అలాగే ప్రస్తు తం పనిచేస్తున్న మిల్లులు ఎగుమతుల వైపు మళ్లేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. ప్రపంచ బియ్యం మార్కెట్లలో తెలంగాణకు ప్రత్యే క స్థానం కల్పించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమన్నారు. రైస్ మిల్లింగ్ రంగంలో కార్మికుల కొర త ప్రధాన సవాలుగా మారిందని పేర్కొన్న మంత్రి, యాంత్రీకరణ, ఆటోమేషన్‌కు మిల్లర్లు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఆధునిక యంత్రాల వినియోగం ద్వారా ఉత్పాదకత పెరగడంతో పాటు కార్మికుల కొరత సమస్యను అధిగ మించవచ్చన్నారు.
స్టీల్ సైలోలు, ఆటోమేటెడ్ గోదాములు, కృత్రిమ మేధస్సు ఆధారిత ధాన్య పర్యవేక్షణ వ్యవస్థలు, డిజిటల్ ఇన్వెంటరీ నిర్వహణ వంటి ఆధునిక నిల్వ సదుపాయాల నిర్మా ణం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రజా, -ప్రైవేటు భాగస్వామ్య విధానంలో భారీ సామర్థ్యంతో గోదాముల నిర్మాణానికి పెట్టుబడిదారు లు ముందుకు రావాలని ఆహ్వానించారు. పర్యావరణ హిత పారా బాయిలింగ్ సాంకేతికతలు అవసరమని, పార్బాయిలింగ్ యూనిట్లలో నీటి వినియోగాన్ని తగ్గించే, విద్యుత్ ఆదా చేసే ఆధునిక సాంకేతికతలను పరిశ్రమలు అవలం బించాలని మంత్రి సూచించారు.
భవిష్యత్ ప్రాసెసింగ్ యూనిట్లు నీటి పునర్వినియోగం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. నాణ్యతతో పాటు పోషక విలువలను కూడా దృష్టిలో ఉంచుకుని బియ్యం ప్రాసెసింగ్ జరగాలని మం త్రి అన్నారు. నియంత్రిత వైటనింగ్, ప్రిసిషన్ పాలిషింగ్, పోషకాలను కాపాడే సాంకేతికతలు, ఏఐ ఆధారిత నాణ్యత నిర్ధారణ విధానాలు వినియోగదారులకు మరింత ఆరోగ్యకరమైన బి య్యం అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో ఏటా సుమారు 300 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరుగుతోందని మంత్రి తెలిపారు. దేశంలో యాసంగి వరి కొనుగోళ్లలో తెలంగాణ వాటా దాదాపు 60 శాతం ఉందన్నారు.






