అంతర్జాతీయ యోగా దినోత్సవ ముందస్తు అవగాహన
హనుమకొండ, జూన్ 8 (విజయక్రాంతి): జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని, హసన్ పర్తి మండలంలోని ఎర్రగట్టు దేవస్థానం కమ్యూనిటీ హాల్లో యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్ అనే కాన్సెప్ట్తో ముందస్తు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు, 66వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, ప్రతి ఒక్కరూ జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో తప్పకుండా పాల్గొనాలి అని పిలుపునిచ్చారు.
యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించడమే కాకుండా, ఆరోగ్యకరమైన జీవనశైలి, మానసిక నిబ్బందన, ప్రకృతితో అనుసంధానంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక కరపత్రాలు విడుదల చేసినారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ శోభారాణి, ఫార్మసిస్ట్ కుమారస్వామి, యోగ ఇన్స్ట్రక్టర్స్ బండారి సుభాష్, లత లు స్థానిక ప్రజలు,యువత పాల్గొనడం జరిగింది.






