16 July, 2026 | 9:50 AM

అంతరాష్ట్ర గొలుసు దొంగ అరెస్టు

29-08-2024 03:25 AM

నిర్మల్, ఆగస్టు 28 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఒంటరిగా ఉంటున్న మహిళ మెడలో బంగారం గొలుసును అపహరించిన అంతరాష్ట్ర దొంగను బుధవారం పోలీసులు పట్టుకున్నారు. నిర్మల్ డీఏస్పీ గంగారెడ్డి వివరాలు వెల్లడించారు. హర్యానాకు చెందిన చెందిన మహ్మద్ అబ్బాస్ కొంతకాలం నుంచి నిర్మల్ జిల్లాలో తిరుగుతూ ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తున్నాడు. వారి మెడలో బంగారు గొలుసులు అపహరించి ఉడాయించాడు. తాజాగా ఓ వృద్ధురాలి మెడలో గొలుసు అపహరించగా, పోలీసులు ఈ కేసులో విచారణను వేగవంతం చేశారు. నిందితుడి వేలిముద్రల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని 2 తులాల బంగారం, వెండి ఆభరణాలను రికవరీ చేశారు. సమావేశంలో సీఐ ప్రవీణ్‌కుమార్  పాల్గొన్నారు.