16 April, 2026 | 7:19 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా అరెస్టు

12-06-2025 12:49 AM
  1. రూ.1.2 కోట్ల విలువైన 20 లీటర్ల హాష్ ఆయిల్ స్వాధీనం
  2. వివరాలను వెల్లడించిన రాచకొండ సీపీ సుధీర్ బాబు 

ఎల్బీనగర్, జూన్ 11 : ఎల్బీనగర్ ఎస్వోటీ, అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి  పెద్ద అంబర్ పేట్ ఓఆర్‌ఆర్ వద్ద రూ.1.2 కోట్ల విలువైన 20 లీటర్ల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. హష్ ఆయిల్ తరలింపులో  ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా, మరో ఇద్దరు ప రారీలో ఉన్నారు. బుధవారం ఎల్బీనగర్ లోని రాచకొండ పో లీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయంలో సీపీ సుధీర్ బాబు ప్రత్యేక సమావేశం నిర్వహించి, వివరాలు వెల్లడించారు.

ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం తీగలవలస పంచాయతీ కెన్నరలోయ గ్రామానికి చెందిన పాంగి కేశవ రావు అలియాస్ కేశ(40)  వ్యవసాయదారుడు. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా నంత్పూర్ తాలూకా పీటా పం చాయతీ బెల్గుడ గ్రామానికి చెందిన జయరామ్ ఖేముండు (26) సివిల్ కాంట్రాక్టర్ గా పని చేస్తున్నాడు. నిందితులిద్దరూ స్నేహితులు, వీరు సులభంగా డబ్బు సంపాదించడానికి మా దకద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్, ఒడి శా రాష్ట్రాల  నుంచి హషీష్ ఆయిల్ను కొనుగోలు చేసి, బెంగళూరులో కొనుగోలుదారులకు సరఫరా చేయడానికి సిద్ధపడ్డారు. హషీష్ ఆయిల్ ను హైదరాబాద్ ద్వారా బెంగళూరుకు రవాణా చేయడానికి పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వస్తున్నారు. నిందితులకు బెంగళూరులో ఒక కొనుగోలుదారుడికి 20 కిలోల హాషీష్ ఆయిల్ ఆర్డర్ ఇ చ్చాడు. దీని ప్రకారం..

నిందితులు ఇద్దరూ ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతా రామరాజు జిల్లా హుకుంపేటలోని కృష్ణ నుంచి జిల్లా 20 కిలోల హషీష్ ఆయిల్ను సేకరించి, బెంగళూరుకు చెందిన ఒక పార్టీకి  విక్రయించడానికి హైదరాబాద్ లోని పెద్ద అంబర్ పేటకు చేరుకున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు 11వ తేదీన బుధవారం  పెద్ద అంబర్పేట్లోని ఔటర్ రింగు రోడ్డు సమీపంలోని సంపూర్ణ హోటల్లో నిందితులు ఇద్దరూ రిసీవర్ కోసం వేచి ఉండగా, ఎల్బీనగర్ ఎస్వోటీ బృందం, అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు వారిని అరెస్టు చేసి, వా రి నుంచి 20 కిలోల హషీష్ ఆయిల్, 3 మొబైల్ ఫోన్లు,  రూ. 870 నగదు స్వాధీనం చేసుకున్నారు.

దర్యాప్తులో వీరికి సహకరిస్తున్న అల్లూరి సీతారామరాజు జిల్లా గుంటసీమ గ్రామాని కి చెందిన కృష్ణ(30), ఇతడి స్నేహితుడు పాంగి కేశవరావు పరారీలో ఉన్నారు. సమావేశంలో రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు, ఎల్బీనగర్ ఇన్ చార్జి డీసీపీ మనోహర్, అదనపు డీసీపీ ఎండీ షకీర్ హుస్సేన్, ఎల్బీనగర్, మహేశ్వరం, అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.