16 April, 2026 | 7:20 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ప్లాస్టిక్ షీట్స్ వేస్తూ యువకుడి మృతి

12-06-2025 12:48 AM

రాజాపూర్ జూన్ 11 : మండలంలోని గుండ్లపొట్ల పల్లి గ్రామంలో ఓ పరిశ్రమలో ప్లాస్టిక్ షీ ట్స్ వేస్తూ ప్రమాదవశాత్తు యువకుడు క్రింద పడి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఎస్త్స్ర శివానంద్ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ సలీమ్ అనే వ్యక్తి గుండ్లపొట్ల పల్లి గ్రామంలోని పరిశ్రమ లో పాత రేకుల సిట్స్ తొలగించి కొత్తవి వేసేందు పని మాట్లాడుకున్నారు.సలీమ్ అతని కుమారులు హమీద్,రియాజ్ ,ఇలియజ్ కలిసి మంగళవారం పరిశ్రమలో సిట్స్ వేస్తున్న క్రమంలో హమీద్ కాలుజరి పైనుంచి పడిపోయాడు.

వెంటనె కుటుంబ సభ్యులు హమీద్ ను జడ్చర్ల దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మృతుని తండ్రి పిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర తెలిపారు.