19 July, 2026 | 2:14 AM

ఆర్‌బీవీఆర్‌ఆర్‌లో ఇంట్రామ్యూరల్ టోర్నమెంట్

19-07-2026 12:00 AM

 హైస్కూల్‌లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నిర్వహణ

నిజామాబాద్, జులై 18(విజయక్రాంతి): నిజామాబాద్ నగరంలోని ఆర్‌బీవీఆర్‌ఆర్ హైస్కూల్‌లో 2026-27కు గాను పాఠశాల ప్రాంగణంలో శనివారం ఇంట్రామ్యూరల్ టోర్నమెంట్(స్పోర్ట్స్ అండ్ గేమ్స్) స్కూల్ స్థాయిలో ప్రారంభించారు. ప్రతియేటా స్కూల్‌లో వివిధ రకాల గేమ్స్ వాలిబాల్, హ్యాండ్‌బాల్, బాస్కెట్ బాల్, ఖోఖో, కబడ్డీ, కరాటే, యోగా, విద్యాతో తదితర పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తైక్వాండో క్రీడలో జాతీయ స్థాయిలో మొట్టమొదటి కాంస్య పతకాన్ని సాధించిన ఎన్ వర్షిణిని శాలువ, మెమెంటోతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమానికి సొసైటీ గౌరవ అధ్యక్షుడు ఎ.ప్రవీణ్‌రెడ్డి, గౌరవ సెక్రటరీ వెంకట రమణారెడ్డి, పాఠశాల చైర్మన్ పి.జగ్‌రెడ్డి, హాస్టల్ కమిటీ చైర్మన్ ఎ.అమర్‌జిత్‌రెడ్డి, ఈసీ మెంబర్ దేవెందర్‌రెడ్డి, కరస్పాండెంట్ యం.విజయానంద్‌రెడ్డి, విద్యా కమిటీ సభ్యులు ఉమామహేశ్వర్‌రెడ్డి, స్వరూపరెడ్డి, ఉపాధ్యాయ బృందం, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు, పాఠశాల చైర్మన్ విద్యార్థులను ఉద్దే శించి ప్రసంగిస్తూ విద్యతో పాటు నైతిక విలువలు, క్రీడలను ప్రోత్సహిస్తున్నామన్నారు.