పద్మశాలి వధూవరుల పరిచయ వేదికను ఉపయోగించుకోవాలి
21-08-2026 03:21 PM
నిర్మల్, ఆగస్టు 21 ( విజయ క్రాంతి): తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే పదవ పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక ఈనెల 23వ తేదీ ఆదివారం నిర్వహిస్తున్నట్టు పద్మశాలి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు బూర ఉమా శంకర్ తెలిపారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రము బాగ్ లింగంపల్లి హైదరాబాదు నందు ఈ పరిచయ వేదిక ఉంటుందన్నారు. తెలంగాణలోని 31 జిల్లాలు చెందిన వధూవరులు ఈ పరిచయ వేదికను సద్వినియోగం చేసుకుకోవడం మంచి అవకాశం అని పేర్కొన్నారు. కావున పద్మశాలి కుల బంధువులు ఉపయోగించుకోవలసిందిగా కోరారు. పద్మశాలి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ వేదిక నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.






