19-05-2024 02:12:19 AM
వికారాబాద్, మే 18 (విజయ క్రాంతి) : జూన్ 9న నిర్వహించే గ్రూప్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వా హణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. శనివారం ఆయన జిల్లా అధికారులతో గ్రూప్ ప్రిలిమిన రీపై సమీక్ష నిర్వహించారు. ఈ సంద ర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడు తూ జిల్లాలో గ్రూప్ ప్రిలిమినరీ పరీక్ష రాసేందుకు 5468మంది అభ్యర్థులను కేటాయించినట్లు తెలి పారు.
అభ్యర్థులు పరీక్షలు రాసేం దుకు వీలుగా అన్ని సామార్థ్యాలు ఉన్న 13 పరీక్ష కేంద్రాలను జిల్లాలో గుర్తించినట్లు తెలిపారు. వికారా బాద్‌లో 7, తాండూరులో 4, పరిగి లో 2 కేంద్రాల ను అన్ని వసతులతో సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. టీఎస్ పీఎస్సీ చైర్మన్ సూచనల మేరకు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలతో నిరంతర విద్యుత్, టాయిలెట్స్, తాగునీరు వంటి సౌకర్యాలు ఉండేలా జాగ్ర త్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రూప్ ప్రిలిమినరీ పరీక్షలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.