calender_icon.png 3 February, 2026 | 5:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నారాయణరావుపేట వైద్యునిపై కొనసాగుతున్న విచారణ

03-02-2026 02:18:46 AM

విజయక్రాంతి కథనంపై జిల్లాలో జోరుగా చర్చ

సిద్దిపేట, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం నారాయణరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ బాపురెడ్డి పై ఆ శాఖ మహి ళా సేఫ్టీ బృందం సభ్యులు సోమవారం వి చారణ జరిపారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు విజయక్రాంతి వా ర్తా కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు డాక్టర్ నిర్మలారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడిన బృందం సోమవారం కూడా విచారణ జరిపారు. ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలి పట్ల వేధింపులకు పాల్పడినట్లు వార్త కథనాల ఆధారంగా తెలుసుకున్న బృందం సభ్యులు ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి విచారించారు.   

బెదిరింపులు, హెచ్చరికలు...  

జిల్లా వైద్య శాఖలో పనిచేస్తున్న ఓ విభా గం ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ బాపురెడ్డి పై వచ్చిన ఆరోపణలకు వ్యతిరేకంగా విచారణ కమిటీకి సమాచారం ఇవ్వాలని హుకుమ్ జారీ చేసినట్లు తెలిసింది. డాక్టర్ విధులలోనే కొనసాగుతాడని, భవిష్యత్తులో అతనితో కలి సి పని చేయాల్సి ఉంటుందని, అలాంటప్పు డు అతనిపై ఆరోపణలు చేస్తే ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది అంటూ పరోక్షంగా బెదిరింపులకు పాల్పడినట్లు విశ్వాసనీయంగా తెలిసింది.

డాక్టర్ లైంగిక వేధింపు లకు పాల్పడినట్లు విచారణ కమిటీకి సమాచారం ఇచ్చిన వారిపై భవిష్యత్తులో తీవ్ర ప ని ఒత్తిడి పెరుగుతుందని లేదంటే సర్వీస్ పరమైన ఇబ్బందులు తప్పాయని హెచ్చరి స్తూ, అతనిపై ఆరోపణలు రుజువైతే వైద్యశాఖ పరువు పోతుందని సిబ్బందిని భయ భ్రాంతులకు గురి చేసినట్లు తెలిసింది. విచారణ కమిటీ సభ్యులు మన శాఖ వారే కాబట్టి వేధింపులకు పాల్పడిన వైద్యునిపై ఎలాంటి చర్యలు ఉండవంటూ సిబ్బందికి హిత బోధ న చేశారని ఆరోపణలు వస్తున్నాయి. విచారణ అనంతరం వైద్యునిపై ఎలాంటి చర్యలు చేపడతారు అనేది సిద్దిపేట జిల్లాలో జోరు గా చర్చ జరుగుతుంది.