సీఎంఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్‌లో ఘనంగా ఇన్వెస్టిచర్ వేడుక
- పాల్గొన్న బేగంపేట్ ఏసీపీ గోపాల కృష్ణమూర్తి, సీఎంఆర్ స్కూల్స్ కార్యదర్శి, కరస్పాండెంట్ సీహెచ్.సౌజన్య రెడ్డి, సీఎంఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ ఎస్.కె.రెడ్డి
- 26-27 విద్యాసంవత్సరానికి నూతన విద్యార్థి నాయకత్వ మండలి బాధ్యతల స్వీకారం
సికింద్రాబాద్, జూలై 11 (విజయ క్రాంతి): సికింద్రాబాద్లోని బోయిన్పల్లి శాఖకు చెందిన సీఎంఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో 202627 విద్యా సంవత్సరానికి నూతనంగా ఎన్నికైన విద్యార్థి నాయకత్వ మండలి (స్టూడెంట్ కౌన్సిల్) బాధ్యతల స్వీకార కార్యక్రమం (ఇన్వెస్టిచర్ సెరిమనీ) శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా బేగంపేట ఏసిపి పి.గోపాలకృష్ణ మూర్తి హాజరై విద్యార్థి నాయకులకు బాధ్యతల గుర్తుగా బ్యాడ్జీలు, అధికారిక సాష్లను అందజేశారు.
సీఎంఆర్ స్కూల్స్ కార్యదర్శి & కరస్పాండెంట్ సిహెచ్. సౌజన్య రెడ్డి, సీఎంఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ ఎస్.కె.రెడ్డి, సీఎంఆర్ హై స్కూల్ ప్రిన్సిపాల్ డి.సునీత , సీఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ నుస్రత్, అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన విద్యార్థి నాయకులతో ఏసీపీ పి. గోపాలకృష్ణ మూర్తి నాయకత్వ ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం వైసిపి గోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ నాయకత్వం అనేది అధికారం కాదని, తోటి విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తూ,సేవాభావం తో ముందుండటమే నిజమైన నాయకత్వమని ఏసిపి పేర్కొన్నారు. నేటి సమాజంలో క్రమశిక్షణ, డిజిటల్ భద్రత, చట్టాలపై అవగాహన ప్రతి విద్యార్థికి ఎంతో అవసరమని సూచిస్తూ,సమాజానికి బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దడం లో సీఎంఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చేస్తున్న కృషిని గోపాల కృష్ణమూర్తి అభినందించారు.
ఈ సందర్భంగా సీఎంఆర్ స్కూల్స్ కార్యదర్శి & కరస్పాండెంట్ సిహెచ్.సౌజన్య రెడ్డి మాట్లాడుతూ నూతన విద్యార్థి నాయకత్వ మండలికి సౌజన్య రెడ్డి అభినందనలు తెలియజేశారు. ప్రతి నాయకుడు ఆదర్శంగా నిలుస్తూ,సహచర విద్యార్థులతో సమన్వ యంతో పనిచేసి పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
ఈ సందర్భం గా తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలు సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో భాగమై, నాయకత్వ లక్షణాలను ప్రదర్శించే అవకాశాన్ని పొందడం చూసి తల్లిదండ్రులు అపారమైన గర్వాన్ని,ఆనందాన్ని వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్యను, సంపూర్ణ అభివృద్ధిని అందించడం లో పాఠశాల యొక్క నిబద్ధతను వారు అభినందించారు.ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






