14 July, 2026 | 6:31 PM

Breaking News

కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •  

పరీక్ష పూర్తికాక ముందే పేపర్ లాక్కున్న ఇన్విజిలేటర్

29-03-2025 08:37 PM

కామారెడ్డి (విజయక్రాంతి): వరుస ఘటనలతో కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అబాసు పాలవుతుంది. ఇంతకు ముందే పరీక్ష కేంద్రంలోకి ప్రైవేట్ యాజమాన్యంని సెల్ ఫోన్ తో అనుమతించిన రచ్చ మరువకముందే పరీక్ష సమయం అయిపోక ముందే పిల్లల దగ్గర నుండి పరీక్ష పేపర్స్ లాక్కోవడంతో దుమారం లేచింది. పరీక్షా కేంద్రంలోని రూమ్ నెంబర్ నాలుగు లో బయోసైన్స్ పరీక్ష పూర్తికాకముందే విద్యార్థుల నుంచి పరీక్ష పేపర్లు లాక్కున్న ఇన్విజిలేటర్ ని తొలగించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.

విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడ వద్దని హెచ్చరించారు. ఇట్టి విషయంలో అమానుషంగా ప్రవర్తించిన ఇన్విజిలేటర్లను విధుల నుంచి తొలగించాలని టీజీవిపి జిల్లా అధ్యక్షుడు గంధం సంజయ్ డిమాండ్ చేశారు. ఇట్టి విషయమై కొందరు జిల్లా ఉన్నతాధికారికి ఈ విషయంలో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిసింది. మండల విద్యాధికారులు ప్రైవేట్ స్కూలు యాజమాన్యానికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారని గ్రామంలో చర్చ నడుస్తుంది.