చేనేత అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
యాదాద్రి భువనగిరి, జూన్ 27( విజయక్రాంతి) : చేనేత మగ్గాలపై అద్భుత కళాఖండాలను రూపుదిద్దే కళాకారులను గౌరవించాలనే ఉద్దే శ్యంతో ప్రభుత్వం ప్రతి యేటా అందించే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డులకు ఔత్సా హి కుల నుంచి జౌళిశాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆగస్టు 7 చేనేత దినో త్సవం సందర్భంగా చేనేత కళాకా రులు, డిజైనర్లను రూ.25 వేల నగదు ప్రోత్సాహం, శాలువా, మెమోంటో తో సత్కరిస్తారు. చేనేత కళాకారుల విభాగం అవార్డుకు 30 సంవత్సరాల వయస్సు పూర్తి చేసి, వృత్తిలో కనీసం పదేళ్ల అనుభవం, డిజైనర్ విభాగం అవార్డుకు 25 సంవత్సరాల వయ స్సు, కనీసం ఐదేళ్ల అనుభవం గల కళాకారులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఔత్సాహికులు తమ నైపుణ్యాలను చాటే నమూనాలతో జిల్లా చేనేత జౌళి శాఖ కార్యాలయం లో జూలై 10వ తేదీలోగా దరఖా స్తులు సమర్పించాలని కోరారు.






