5 July, 2026 | 7:08 AM

ఆటోలపై స్పెషల్ డ్రైవ్

28-06-2024 01:29 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27 (విజయక్రాంతి) : నగరంలో నిబంధనలకు విరుద్దంగా పాఠశాల విద్యార్థులను తరలిస్తున్న ఆటోలపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపించారు. సామర్థ్యానికి మించి విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటో డ్రైవర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. గురువారం ఉదయం 7.30 నుంచి 9.30 వరకు సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల దాకా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ తనిఖీల్లో ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేని, డ్రంకన్ డ్రైవ్, ఓవర్ లోడింగ్, 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల విద్యార్థులను ఆటోలో తరలించడం, మైనర్లు డ్రైవింగ్ చేయడం తదితర అంశాలను ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని 11 మందిపై, సామర్థ్యానికి మించి తీసుకెళ్తున్న 95 ఆటోలపై, రాంగ్ సైడ్ వెళ్తున్న 40 ఆటోలపై, యూనిఫాం లేని 406 మంది డ్రైవర్లపై, డాక్యుమెంట్లు సక్రమంగా లేని 11 డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు.