2 July, 2026 | 11:33 PM

సమాచార కమిషనర్ పదవికి దరఖాస్తుల ఆహ్వానం

12-06-2024 01:44 AM

హైదరాబాద్, జూన్ 11( విజయక్రాంతి): రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ పదవికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. సీఎస్ శాంతికుమారి ఆదేశాల మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంగళ వారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 29 సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తుకు చివరి తేదీగా పేర్కొంది. దరఖాస్తు ఫారమ్ ను https://telangana.gov.in లేదా http://tsic.gov.in వెబ్‌సైట్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని వెల్లడించింది. పూర్తి చేసిన దరఖాస్తులకు అన్ని పత్రాలను జతచేసి చీఫ్ సెక్రటరీ కార్యాలయం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సెక్రటేరియట్, హైదరాబాద్ -500022 చిరునామాకు రిజిస్టర్ పోస్టు చేయాలని నోటిఫికేషన్‌లో చెప్పింది. అయితే 04/07/2023న విడుదలైన నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదని సూచించింది.