కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు ఆహ్వానం
15-05-2024 12:57 AM
వనపర్తి, మే 14 (విజయక్రాంతి) : ఫ్రాన్స్ దేశంలో ఈ నెల 20వ తేదిన జరుగుతున్న ప్రతిష్టాత్మక కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన ఉప్పుగంటి రాఘవేందర్‌కు ఆహ్వానం లభించింది. ఒక గంట 15 నిమిషాలు నిడి వి గల ఇన్ రిట్రీట్ అనే సినిమాను కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమా ఎడిటింగ్ చేసి నందుకు గాను రాఘవేందర్‌కు ఆహ్వానం లభించడం పట్ల వనపర్తి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




