కలెక్టర్ చొరవతో కుటుంబ సభ్యులను కలిసిన వ్యక్తి
మానవత్వానికి ప్రతిరూపంగా నిలిచిన కలెక్టర్
కలెక్టర్ ను అభినందించిన వ్యక్తి కుటుంబ సభ్యులు
జగిత్యాల జిల్లా నుంచి వచ్చి వ్యక్తిని తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు
కామారెడ్డి,(విజయక్రాంతి): తమ కుటుంబం నుంచి విడిపోయిన 25 సంవత్సరాలకు ఆచూకీ లభించడంతో ఆ కుటుంబ సభ్యులకు ఎనలేని సంతోషం వ్యక్తపరిచిన ఘటన శనివారం కామారెడ్డి కలెక్టరేట్లో చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లాకు చెందిన మానసిక వ్యక్తి కుటుంబ సభ్యుల నుంచి తప్పిపోయి ఇరవై సంవత్సరాలకు కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగువాన్ చొరవతో కుటుంబ సభ్యులకు కలిసిన మానసిక వికలాంగుని ఉదంత మీది. జగిత్యాల జిల్లా చెందిన మానసిక వికలాంగుడు తిరుగుతూ తిరుగుతూ కామారెడ్డికి చేరుకున్నాడు.
ఆ విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్ అతనికి వైద్య సేవలు అందిస్తూ వైద్య పరీక్షలు చేయించి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ప్రమీల కు ఆదేశాలు జారీ చేయడంతో మానసిక వికలాంగునిగా ఉన్న వ్యక్తికి సేవలందిస్తూ వైద్య సేవ పరీక్షలు చేయించి శుభ్రపద్య కార్యక్రమాన్ని నిర్వహించి కొత్త జీవితం ఇచ్చారు. అతని ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడానికి అవసరమైన చికిత్స అందించారు.
ప్రభుత్వ వృద్ధాశ్రమం లో మానసిక వ్యక్తిని చేర్చుకొని వృద్ధాశ్రమ సిబ్బంది ఆ వ్యక్తిని సంరక్షణ తీసుకొని అతనికి ఆహారం శుభ్రత వైద్య సేవలు అందించారు.ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు శనివారం వచ్చి 25 సంవత్సరాల క్రితం తమ కుటుంబం నుంచి విడిపోయిన వ్యక్తి తమకు కలవడం ఎంతో సంతోషాన్ని కల్పించిందని, ఈ అవకాశాన్ని కల్పించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ మానవత్వాన్ని కొనియాడుతూ కలెక్టర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.




