కిషన్ రెడ్డి కంటే.. రేవంత్ రెడ్డి ఎక్కువ కష్టపడ్డారు: కేటీఆర్
రాజన్న సిరిసిల్ల: ఢిల్లీలో గస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్లుగా బీజేపీ- కాంగ్రెస్ పార్టీ వైఖరి ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల్లో ఆరేడు సీటల్లో డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీకి సహకరించారని కేటీఆర్ విమర్శించారు. భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి కిషన్ రెడ్డి కంటే.. రేవంత్ రెడ్డి ఎక్కువగా కష్టపడ్డారని తెలిపారు. కేంద్రంలోనూ ఏ కూటమికి స్పష్టమైన ఆధిక్యం వచ్చే పరిస్థితి లేదని ఆయన జోస్యం చెప్పారు. ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే కూటమిదే కేంద్రంలో అధికారం అన్నారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఈ ఎన్నికల్లో అద్భుతంగా కృషి చేశారని చెప్పారు. తీయ పార్టీలకు బీఆర్ఎస్ ముచ్చెమటలు పట్టించిందన్నారు.
మూడు పార్టీల్లో బీఆర్ఎస్ కే అధిక ఎంపీ సీట్లు వస్తాయని కెటిఆర్ పేర్కొన్నారు. రైతు భరోసా వేయనందకు రైతులు ఆగ్రహంతో ఉన్నారని కెటిఆర్ అన్నారు. సిరిసిల్ల లో బీఆర్ఎస్ నేతలు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. రుణమాఫీ విషయంలో మోసం చేశారని రైతులు ఆగ్రహంతో ఉన్నారన్నారు కెటిఆర్. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలాచారని పేర్కొన్నారు. అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. మహిళలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కోపంతో ఉన్నారు.. నెలకు రూ. 2500 ఇవ్వలేదని మహిళలు కాంగ్రెస్ పై కోపంతో ఉన్నారని చెప్పారు. భారతీయ జనతా పార్టీపై కూడా ప్రజావ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని తెలిపారు. ఈ సారి సగం సీట్లు బీసీ కులాలకు బీఆర్ఎస్ కేటాయించిందని స్పష్టం చేశారు. పెట్రోల్, నిత్యావసరాల ధరలు పెరిగినందున మోడీపై కోపంతో ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు.




