5 April, 2026 | 12:01 AM

ఫీజు బకాయిలపై హైకోర్టు తీర్పు సరికాదు

04-04-2026 09:20 PM

- పేద విద్యార్ధులు చదువులకు తీవ్ర నష్టం.

- ప్రభుత్వ హామీలతో కళాశాలలు విద్యార్ధులను చేర్చుకున్నారు. 

- ఫీజుల కోసం విద్యార్ధులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదు.

- ఏఐఎస్ఎఫ్  జిల్లా కార్యదర్శి వరక అజిత్

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఫీజు బకాయిలపై ఇచ్చిన తీర్పులో విద్యార్థుల నుండి వసూళ్లు చేసుకోని ప్రభుత్వం ఇచ్చిన తర్వాత తిరిగి విద్యార్ధులకు చెల్లించాలని తీర్పు సరైనది కాదని ఇది విద్యార్థుల చదువుల అభివృద్ధికి గడ్డలిపెట్టని హైకోర్టు తీర్పును పునఃసమీక్ష చేయాలని ఏఐఎస్ఎఫ్ ప్రైవేటు కళాశాలలు ప్రభుత్వం ప్రకటించిన ఫీజు పథకం అమలు చేస్తామని అంగీకారాన్ని తెలిపి విద్యార్థులను చేర్చుకున్నారని అలాంటిది ప్రైవేటు యాజమాన్యాల బకాయిలను చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వకుండా విద్యార్ధుల నుండి వసూళ్లు చేసుకోండి అనే తీర్పు సరైనది కాదు.

అణాగారిన వర్గాలు నుండి ఇప్పుడే ఉన్నత విద్యలోకి వస్తున్న ప్రధానంగా ఈ ఫీజులు పోందే వారు పేద విద్యార్థులు వారిలో రాష్ట్రంలో 14 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బి.సి. ,మైనారిటీ విద్యార్ధులలే ఈ పథకం కింద లబ్ది పొందుతున్నారని వారిని ఈ తీర్పు వల్లన మరింత వేధింపులు గురి అవుతారని ఏఐఎస్ఎఫ్  పేర్కొంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రైవేటు యాజమాన్యాలు ఫీజులు బకాయిలు రావడం లేదని పేద విద్యార్థుల సర్టిఫికేట్స్ ఇవ్వకుండా వేధింపులు గురి చేస్తున్నారని, దీని వల్ల గతంలో విద్యార్థులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని తెలిపారు.

ప్రభుత్వం తక్షణమే రాష్ట్రంలో పెండింగ్ ఉన్న ఫీజు రీయంబర్స్, స్కాలర్ షిప్స్ విడుదల చేసి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని హైకోర్టు తీర్పును పునఃసమీక్ష చాలా చేయాలని, ప్రభుత్వానికి తక్షణమే ఫీజుల విడుదల కోసం ఆదేశాలు ఇవ్వాలని AISF డిమాండ్ చేస్తోంది ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి మాణిక్యాల వినయ్ జిల్లా ఉపాధ్యక్షులు సంజయ్ కీర్తన మై సంజన మానస స్వప్న స్పందన కవిత సోని ఉదయ్ రాజేష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు