14వ డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం
04-04-2026 09:31 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్లో కార్పొరేటర్ గడ్డి ప్రదీప్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున కొత్త వార్డ్ ఆఫీసు దగ్గర ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు స్పెషలిస్ట్ డాక్టర్ల బృందం చే ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో స్త్రీల వైద్య నిపుణులు, పిల్లల వైద్య నిపుణులు, ఎముకలు & కీళ్ళ నిపుణులు, కంటి నిపుణులు, దంత వైద్య నిపుణులు, చెవి ముక్కు గొంతు నిపుణులు మొదలైన ఎనిమిది రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని, ఇట్టి మెగా వైద్య శిబిరంను డివిజన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్ ప్రదీప్ తెలియజేసారు.




