27 June, 2026 | 7:30 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

మంత్రి శ్రీధర్‌బాబుకు ఆటా ఆహ్వానం

12-12-2025 02:20 AM

మహాసభలకు, బిజినెస్ సెమినార్‌కు హాజరుకావాలని విజ్ఞప్తి

హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): అమెరికన్ తెలు గు అసోసియేషన్ (ఆటా) 19వ మహాసభలు యువజన సద స్సు అమెరికాలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నారు. ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును గురువారం ఆటా అధ్యక్షుడు జ యంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీశ్‌రెడ్డి, మీడియా కో ఆర్డినేటర్ ఈశ్వర్ బండా మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.

రెం డు తెలుగు రాష్ట్రాల్లో ఆటా చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్ 19న హైదరాబాద్ టీ-హబ్‌లో నిర్వహించనున్న బిజినెస్ సెమినార్‌కు కూడా ముఖ్యఅతిథిగా హాజరుకావాలని మంత్రి శ్రీధర్‌బా బును కోరారు. ఈ సమావేశంలో అమెరికా- తెలంగాణ మధ్య వ్యాపార, సాం కేతిక, స్టార్టప్ రంగాల అనుబంధాన్ని బలోపేతం చేయడానికి ఆటా చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. ఆటా మహాసభల్లో అమెరికాలోని ప్రవాస తెలుగు సమాజం, వ్యాపారవేత్తలు, యు వ ఇన్నోవేటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారని నిర్వాహకులు మంత్రికి తెలిపారు.