calender_icon.png 12 December, 2025 | 12:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాచలం సర్పంచ్ గా కాంగ్రెస్ అభ్యర్థి పూణెం కృష్ణ దొర ఎన్నిక

12-12-2025 09:30:17 AM

తీవ్ర ఉత్కంఠ లేపిన భద్రాచలం పంచాయతీ ఎన్నికలు

ఫలించిన ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు మాజీ ఎమ్మెల్యే, కార్పొరేషన్ చైర్మన్ పోడియం వీరయ్య రాజకీయ వ్యూహం 

20 వార్డులకు 15 వార్డు గెలుపు

భద్రాచలం, (విజయక్రాంతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన  భద్రాచలం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ  విజయం సాధించింది. సర్పంచ్ అభ్యర్థి పూణేం కృష్ణ తో పాటు 15 వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మిగతా 5 వార్డుల్లో 3 వార్డులు బి ఆర్ ఎస్ కూటమి, ఒకటి టిడిపి కూటమి మరొక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. భద్రాచలం పట్టణంలో మొత్తం 40 వేల 761 ఓటర్ ఉండగా అందులో పురుషులు 19 624  మంది ఓటర్లు మహిళలు 21 136 మంది ఓటర్లు ఉన్నారు. అయితే గురువారం నాడు జరిగిన పోలింగ్లో 9475 మంది పురుషులు 10445 మంది మహిళలు మొత్తం 19920 మంది అనగా 48. 87% మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. 

మధ్యాహ్నం ఒంటిగంటకు ఎన్నికలు పూర్తయినప్పటికీ రాత్రి 7 గంటల వరకు కౌంటింగ్ ఏర్పాట్ల పేరుతో అధికారులు కాలయాపన చేయటంతో ఒక్కసారిగా రాజకీయ నాయకుల్లోనూ అభ్యర్థులను అయోమయం చోటు చేసుకుంది. అధికార పార్టీ చెందిన ఉన్నత నాయకులు ఆదేశాల మేరకు కావాలనే పోలింగ్ అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ దశలో ఎట్టికేలకు రాత్రి 10 గంటలకు అధికారులు వార్డు మెంబర్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలను విడుదల చేశారు. దీంతో ఒకసారి గా అభ్యర్థులలోనూ రాజకీయ నాయకులను ఉన్న ఉత్కాంతతకు తెర తీశారు. 

గ్రామపంచాయతీ జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ సిపిఐ పార్టీల కూటమి తో పాటు బి ఆర్ ఎస్, సిపిఎం, గోండ్వాన గిరిజన సంఘం మరో కూటమిగా, బిజెపి తెలుగుదేశం జనసేన పార్టీలు మూడో కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. మూడు పార్టీలు హంగులు ఆర్భాటాలతో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయినప్పటికీ భద్రాచలం పట్టణ ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపు స్పష్టంగా మోగ్గు చూపడంతో కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లు సునాయాసంగా విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి ఎమ్మెల్యే వెంకటరావు కార్పొరేషన్ చైర్మన్ పోడియం వీరయ్య తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం వ్యూహ రచన చేసి ఐక్యంగా విజయం కోసం కృషి చేయడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు.

దీంతో భద్రాచలంలో ఉన్న మొత్తం 20 వార్డులలో మెజారిటీ వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ విజేతలుగా 1వార్డు నుండి చెంచు సుబ్బారావు, 2 వార్డు నుండి బొంబోతుల రాజీవ్, 3 వార్డు నుండి బొంత రమణ, 5వ వార్డు నుండి నర్రవాణి, 8వార్డు నుండి పెద్దినేని లక్ష్మి , 9వ వార్డు నుండి కారం సుజాత, 10 వ వార్డు నుండి మిట్ట రాజు, 11 వ వార్డు నుండి భూక్య సుశీల, 12వ వార్డు నుండి కారం దుర్గారావు, 13వ వార్డు నుండి తాటి ఉదయ్ గెలుపొందారు. అలాగే 15వ వార్డు నుండి సున్నం ఈశ్వరి, 16వ వార్డు నుండి రత్నం కవిత, 17వ వార్డు నుండి సున్నం భూలక్ష్మి, 18 వ వార్డు నుండి జగ్గా కుమారి, 20వ వార్డు నుండి నూకల కిరణ్ కుమార్లు, 19 వ వార్డు కాంగ్రెస్ కూటమికి చెందిన సిపిఐ పార్టీ అభ్యర్థి మహేష్ విజయం సాధించారు. 14వ వార్డ్ నుండి స్వతంత్ర అభ్యర్థి ఇలమల అశోక్ కుమార్ కాంగ్రెస్ అభ్యర్థి అరికెల తిరుపతిరావు పై విజయం సాధించారు.

అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ కూటమి నుండి  నుండి 4వ వార్డు బిఆర్ఎస్ బలపరిచిన సిపిఎం పార్టీ అభ్యర్థి బండారు శరత్ , 7 వార్డు అభ్యర్థిగా బిఆర్ఎస్ కు చెందిన కావూరి గోపి, 20వ వార్డు అభ్యర్థిగా సిపిఎం పార్టీ చెందిన ఇర్పాఅనసూయ ఎన్నికయ్యారు. అంతేకాకుండా బిజెపి టిడిపి జనసేన కూటమి ఉమ్మడిగా పోటీ చేయగా అందులో 6వార్డు నుండి తెలుగుదేశం అభ్యర్థి అబ్బినేని నేని వినీల రాణి విజయం సాధించారు. మొత్తం 20 వార్డులలో కాంగ్రెస్  అభ్యర్థులు 15 మంది టిఆర్ఎస్ కూటమి అభ్యర్థులు ముగ్గురు, బిజెపి కుటమి అభ్యర్థి ఒకరు విజయం సాధించారు.

అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ కూటమి నుండి పూణేం కృష్ణ, బిఆర్ఎస్ కూటమి నుండి మానె రామకృష్ణ, బిజెపి కూటమి నుండి బానోత్ హరిచంద్ర నాయక్ తో పాటు పుణ్యం ప్రదీప్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. మూడు కూటమిల మధ్య పోటా పోటీగా జరిగిన సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి పూనెం కృష్ణ దొర 1400 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఆదరించారు  భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అటవీ కార్పొరేషన్ చైర్మన్ పోడియం వీరయ్య భద్రాచలంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులు అనుహ్య విజయం సాధించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే కారణమని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు రాష్ట్ర అటవీ కార్పొరేషన్ చైర్మన్ పోడియం వీరయ్య తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం చేకూర్చిన భద్రాచలం ఓటర్లకు సర్వదా కృతజ్ఞతలుగా ఉంటామని, గెలిచిన తమ అభ్యర్థులు భద్రాచలం అభివృద్ధి కోసం కృషి చేస్తారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి అధిక నిధులు తీసుకువచ్చి భద్రాద్రిని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి తీరుతామని వారు ఈ సందర్భంగా తెలిపారు.