calender_icon.png 12 December, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిన్నెదరి@5.4 డిగ్రీలు

12-12-2025 02:18:33 AM

  1. భీమ్‌పూర్‌లో 6.1 డిగ్రీలు నమోదు

కుమ్రంభీం, ఆదిలాబాద్ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు 

రాష్ట్రంలో రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్/కుమ్రంభీం ఆసిఫాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి):గురువారం ప లు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమ్రంభీం జిల్లాలో చలి ప్రభా వం రోజు రోజుకూ పెరుగుతూ ప్రజలను వణికిస్తోంది. గురువారం తిర్యాని మం డలం గిన్నెదరిలో కనిష్ట ఉష్ణోగ్రత 5.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఈ జిల్లాలో గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు వరుసగా పడిపోతూ శీతల గాలులతో ప్రజా జీవనంపై ప్రభావితమవుతోంది. గిన్నెదరిలో నమోదైన 5.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతగా అధికారులు వెల్లడించారు.

ఆదిలాబాద్ జిల్లాలోని భీమ్‌పూర్‌లో 6.1 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లాలోని మోయినాబాద్‌లో 6.4 డిగ్రీ లు, సంగారెడ్డి జిల్లాలోని జరాసంఘంలో 6.5 డిగ్రీలు, సిద్ధిపేట జిల్లాలోని అక్బర్‌పేట్‌లో 7.0 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. మొత్తంగా 26 జిల్లాల్లో 10లోపు డిగ్రీల ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ప్రభావం అత్యధికంగా ఉం దని తెలిపారు.  కాగా రాష్ట్రంలో రాబోయే రెండు మూడు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోద య్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణం కంటే 3 నుండి 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.