ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం
తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) ఆదివారం తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసింది. ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో సుమారు 70 మంది కమిటీ సభ్యులు మంత్రిని కలిశారు. మంత్రిని కలిసిన వారిలో హీరో కిరణ్, జేవియర్, స్నిగ్ధరెడ్డి, అక్సాఖాన్, ఫైట్ మాస్టర్ రవి, రమేశ్ నా యుడు, కాచం సత్యనారాయణ, అశోక్‌కుమార్, కేవీఎల్ నరసింహరావు, శ్రీనివాస్‌గౌడ్, అల్లా బక్ష వెంకటేశ్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ ఇటీవల జరిగాయి. కొత్త కమిటీ ప్రమాణస్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాం. తప్పకుండా హాజరవుతానని ఆయన హామీ ఇచ్చారు. సినీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కూడా ఆయన చెప్పారు” అని వివరించారు.




