సస్పెన్స్ అనంతం
వెంకట్ శివకుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘అనంతం’. ఈ చిత్రంలో రుచిత సాధినేని, రామ్‌కిషన్, స్నిగ్ధ నయని, వసంతిక మచ్చ, చైతన్య సగిరాజు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆరుద్ర ప్రొడక్షన్స్ సమర్పణలో విజయలక్ష్మి, సుధీర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి చరణ్‌రెడ్డి రేకులతో కలిసి స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించారు కథానాయకుడు వెంకట శివకుమార్.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోందీ సినిమా. ఈ నేపథ్యంలో మేకర్స్ హీరో నిఖిల్ చేతుల మీదుగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేయించారు. టీజర్ చాలా ఆకట్టుకుందంటూ నిఖిల్.. మూవీ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్మాతలు విజయలక్ష్మి, సుధీర్ మాట్లాడుతూ.. ‘లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను నిర్మించాం. త్వరలోనే మంచి తేదీ చూసి థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి డీవోపీ: రాహుల్ కేజీ విఘ్నేష్, దీపక్‌కుమార్; సంగీతం: స్నిగ్ధ నయని.




